హైదరాబాద్‌ బాలానగర్‌లో దారుణం | Hyderabad Balanagar Mother Twins Children Case Full Details | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ బాలానగర్‌లో దారుణం

Oct 14 2025 7:44 AM | Updated on Oct 14 2025 8:44 AM

Hyderabad Balanagar Mother Twins Children Case Full Details

సాక్షి, హైదరాబాద్‌:  మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను బలవన్మరణానికి పాల్పడింది(Balanagar Mother Kills Children). మరణించిన చిన్నారులు కవలలుగా తెలుస్తోంది. 

బాలానగర్‌ పద్మారావునగర్‌ ఏరియాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను హతమార్చి.. ఆపై నివాసం ఉంటున్న బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను  కార్తీకేయ(2) లాస్యత వల్లి(2), సాయిలక్ష్మిగా పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.

ఇదీ చదవండి: నాన్నమ్మ మందలింపు, భార్యాకొడుకుతో కలిసి రైలు కింద పడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement