హైదరాబాద్: #NothingIsFree ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) గురించి పరిచయం అవసరంలేదు. తాను ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చేలా మెలగడం ఆయన నైజం. పోలీస్ అధికారిగా నేరగాళ్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. ఆర్టీసీ ఎండీగా, ఆర్టీసీలో వినూత్న విధానాలను అవంలంబించి, తానేంటో నిరూపించు కున్నారు. ఇక బెట్టింగ్‌యాప్స్‌కు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన ప్రచారం ఉద్యమంలా సాగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసే వారి పాలిట సింహ స్వప్నమే అయ్యారు. తాజాగా హైదరాబాద్ నగర కమిషనర్‌గా సైబర్ నేరాలపై దృష్టిపెట్టరు. డేటా సేప్టీ గురించి తనదైన రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన ఎక్స్ లో చేసిన వరుస పోస్ట్‌లు పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌గా మారాయి.
డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండటం ఒక ఆప్షన్ కాదు… మీ భద్రతకు తప్పనిసరి! మీ డేటా… మీ జీవితానికి సంబంధించిన అంశం. దాన్ని మీరు కాపాడుకోకపోతే మరెవ్వరూ కాపాడలేరు.
చదవండి: ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ
డిజిటల్ యుగంలో డేటా దుర్వినియోగం అనేది పెను ముప్పుగా మారింది. సమాచారాన్ని తమ ఆయుధంలాగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. 'ఇంటర్నెట్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే ఉచితంగా కంటెంట్ వస్తుంది. ఎలాంటి లింకునైనా ఓపెన్ చేస్తా. ఎంచక్కా ఎంజాయ్… pic.twitter.com/C6LllCQH60
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 24, 2025
తస్కరణకు గురైన డేటాను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు.. మీకు ఫేక్ లింకులు పంపుతారు, ప్రలోభపెట్టే కాల్స్ చేస్తారు. ఖాతాలు హ్యాక్ చేస్తారు. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. డబ్బులు గుల్ల చేస్తారు. డిజిటల్ అరెస్ట్‌లు లంటూ వ్యక్తిగతంగా వేధింపులకు దిగుతారు. ఒక్క క్లిక్‌తోనే మీ మొబైల్‌ను టార్గెట్ చేస్తారు.
అనుమానాస్పదమైన సైట్లు, యాప్స్… ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. ‘Free movies’, ‘Free downloads’, ‘Free games’ — ఇవన్నీ ప్రమాద సంకేతాలు. ఉచితం అనిపించే ఈ కంటెంట్.. మీకు తాత్కాలిక ఎంజాయ్ ఇచ్చినా… భవిష్యత్తులో జీవితాంతం నష్టాన్ని మిగిల్చే ప్రమాదం పొంచి ఉంది.
మీ డేటా- మీ భద్రత. నమ్మదగిన వెబ్‌సైట్లనే వినియోగించండి. అపరిచిత లింక్‌లు ఓపెన్ చేయొద్దు. మీ ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోండి. అనుమానాస్పద యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి. అంటూ వరుస ట్వీట్లు చేశారు. డేటా చోరికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేయండి. లేదా జాతీయ సైబర్ క్రైం పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ ప్రజల్నికోరారు.


