.
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట్ పోలీస్ లైన్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. గన్ మిస్‌ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏపీ క్యాడర్‌కు చెందిన గోవర్ధన్‌రెడ్డి అంబర్‌పేట పీఎల్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం రాత్రి 12 30గం. సమయంలో తుపాకీ మిస్ ఫైర్ అయ్యి అతను గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ గోవర్ధన్‌ను చికిత్స కోసం నాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన ఎలా జరిగింది అనేదానిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


