యాదాద్రి దర్శనానికి 3 గంటలు | Huge Devotees Crowd At Yadadri Temple | Sakshi
Sakshi News home page

యాదాద్రి దర్శనానికి 3 గంటలు

Jan 9 2023 1:33 AM | Updated on Jan 9 2023 9:38 AM

Huge Devotees Crowd At Yadadri Temple - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు మూడు గంటలు, వీఐపీ దర్శనానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 30వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్య ఆదాయం రూ.45,86,412 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement