బండెనక బండి..స్వామి దర్శనానికి పోదాం పదండి.. | Heavy Rush At Yadadri Temple As Weekend And Summer Holidays Draw Devotees, Check Details Inside | Sakshi
Sakshi News home page

బండెనక బండి..స్వామి దర్శనానికి పోదాం పదండి..

May 25 2026 7:53 AM | Updated on May 25 2026 10:33 AM

Devotees Rush To Yadadri Temple

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం.. వేసవి సెలవులు కలిసి రావడంతో శ్రీనృసింహుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. 

భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి నాలుగు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 50 వేలమందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చాలా మంది భక్తులు సెంట్రల్‌ పార్కింగ్‌ వద్ద వాహనాలను పార్క్‌ చేసి, ఉచిత బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement