రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఉన్నత స్థాయి సమీక్ష | High Level Review of SBIs Role in Rayadurg Land Dispute | Sakshi
Sakshi News home page

రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఉన్నత స్థాయి సమీక్ష

Jun 20 2026 4:38 PM | Updated on Jun 20 2026 5:15 PM

High Level Review of SBIs Role in Rayadurg Land Dispute

హైదరాబాద్‌: రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్‌బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఎస్‌బీఐ చైర్మన్‌, ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టిపై రాజకీయ ప్రత్యర్థుల ‍ప్రభావం ఉందని భావిస్తున్నాయి. ఎస్‌బీఐ వ్యవహారంపై ఆర్‌బీఐ, కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

కాగా, భూముల వేలంపై హైకోర్టు 21 రోజులపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. అయితే, వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమవేనని ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపైనే విచారణ జరిపిన హైకోర్టలు స్టే విధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement