పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలోని సీఐఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ వద్ద ఒక ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ టింకు తుపాకీ మ్యాగజిన్ శుభ్రం చేస్తుండగా అనుకోకుండా తన చేతిలో ఉన్న తుపాకీ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గాయపడ్డారు.
దాంతో గాయపడిన శ్రీనివాస్‌ను మెరుగైన వైద్యం కోసం వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై ఎన్టీపీసీ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.


