నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. నవరాత్రుల ముగింపు సందర్భంగా నేడు(మంగళవారం, సెప్టెంబర్ 22వ తేదీ) భైంసా పట్టణంలో గణనాథుల నిమజ్జన శోభాయాత్రను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణేష్ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
నవరాత్రి ఉత్సవాల అనంతరం పట్టణంలో గణేష్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్రను ఎంతో ఘనంగా నిర్వహించారు. వివిధ మండపాల నుంచి తరలివచ్చిన వినాయక విగ్రహాలతో భైంసా వీధులన్నీ కోలాహలంగా మారాయి. ఒకప్పుడు తీవ్రమైన మత ఘర్షణలకు కేంద్రంగా ఉన్న భైంసా.. ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా ‘హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదాలతో హోరెత్తింది.
భైంసా పట్టణం సున్నితమైన ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో పాటు అదనపు పోలీసు బలగాలను మోహరించి శోభాయాత్రను పర్యవేక్షించారు.


