నేడు వర్సిటీలతో గవర్నర్‌ సమావేశం  | Governor Tamilisai Soundararajan Meeting With Universities On September 25th, Details Inside - Sakshi
Sakshi News home page

నేడు వర్సిటీలతో గవర్నర్‌ సమావేశం 

Sep 25 2023 4:08 AM | Updated on Sep 25 2023 11:22 AM

Governor Tamilisai Soundararajan meeting with Universities September 25 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘చా­న్స్‌­లర్‌ కనెక్ట్స్‌ అల్యూమినీ’ కార్యక్రమంలో భా­గంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమ­వారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధికారులు, ప్రముఖ విద్యావేత్తలతో సమావేశమవుతారు. రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 9.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై గవర్నర్‌ వర్సిటీ అధికారులతో చర్చించనున్నారు.

సుదీర్ఘ కాలంగా పెద్ద సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో చాలా వర్సిటీల్లో పలు రకాల కోర్సులు మూతబడడం, ఫీజులను అడ్డగోలుగా పెంచడం, తరగతుల నిర్వహణ జరగకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వర్సిటీల్లో గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్‌ పరీక్షలు జరగకపోవడం, రాజకీయాలతో వర్సి­టీల పాలన వ్యవహారాలు పూర్తిగా గాడి తప్పడం వంటి అంశాలు చర్చకు వచ్చే 
అవకాశం ఉంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement