హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వ ర్యాంకింగ్

GHMC Mayor Vijayalakshmi Opposed Central Ranking To Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీసేలా కేంద్రం ర్యాంకింగ్ ఇచ్చిందని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను ఇటీవల కేంద్ర విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మేయర్‌ స్పదింస్తూ.. సులభతరం జీవనం ర్యాంకింగ్‌లో నగరానికి కేంద్రం 24వ స్థానం ఇవ్వడం సరికాదన్నారు. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్‌.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కన్నా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే నగర ర్యాంకింగ్‌ను తగ్గించారని విమర్శించారు. 24వ ర్యాంక్‌ను హైదరాబాదీలు అంగీకరించరని విజయలక్ష్మి చెప్పారు.

చదవండి: ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌: టాప్‌ ప్లేస్‌లో బెంగళూరు

ఇదిలా ఉండగా.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020ను కేంద్ర ప‌్ర‌భుత్వం గురువారం విడుద‌ల చేసింది. న‌గ‌రాల్లో జీవ‌నం సాగించేందుకు అనుకూల ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఈ ర్యాంకుల‌ను కేటాయించింది. మిలియన్‌కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగ‌ళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ త‌రువాతి స్థానాల్లో పుణె, అహ్మ‌దాబాద్ ఉన్నాయి. అయితే 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖ ఉంగా హైదరాబాద్‌ 24వ స్థానంలో నిలిచింది. 

చదవండి: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్‌

గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు ఆ అర్హత లేదా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top