'ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు'

GHMC Elections 2020: CP Sajjanar Press Meet At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. బల్దియా ఎన్నికల కోసం 13,500 మంది పోలీసులతో అన్ని భద్రతాపరమైనా ఏర్పాట్లు చేశామని అన్నారు. వీరిలో 10,500 మంది సివిల్‌, 3000 మంది ఏఆర్‌ సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లోని ముఖ్యాంశాలు..
►జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చాము. 
►స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాము.
►ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికల ప్రచారం ముగిసింది. 
►నార్మల్, సెన్సిటివ్,  హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ, సీఐ స్థాయి అధికారి,  ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీల నేతృత్వంలో భద్రత ఏర్పాటు చేశాం. 
►38 స్ట్రైకింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 9 సీపీ రిజర్వ్ టీమ్స్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. 
►73 హైపర్ సెన్సిటివ్ పికెట్‌లు నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాము.
►హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఒక ఎస్‌ఐ, 4 ఏఆర్ సిబ్బందిని ఏర్పాటు చేశాము. 
►సైబరాబాద్ కమిషనరేట్‌లో 38 వార్డ్‌లు ఉన్నాయి
►2,437 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 
►1,421 నార్మల్  పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
►766 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
►250 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
►177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాము. 
►సైబరాబాద్‌లో 15 బార్డర్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. 
►587 లైసెన్సెడ్ గన్స్ డిపాజిట్ చేయడం జరిగింది. 
►369 మంది రౌడీ షీటర్‌లను బైండోవర్ చేశాం. 
►రూ.15 లక్షలు విలువ చేసే 396 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం 
►ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్‌కు జియో ట్యాగింగ్ చేశాం.
►సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాం. 
►పెండింగ్‌లో ఉన్న 24 మంది పై నాన్ బెయిలబుల్ వారెంటీలు ఎగ్జిక్యూట్ చేశాం. 
►సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివి లు ఏర్పాటు చేసి వాటిని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేశాం. 
►జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని అనుసంధానం చేశాము.
►1 లక్ష సీసీ కెమెరాలు ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నాము. 
►డీసీపీ, ఏసీపీ ఆఫీస్‌లో రౌండ్ ది  క్లాక్ నిరంతర పర్యవేక్షణ ఉంచాము.
►ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచాము.
►రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఓటర్‌లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. 
►ఎన్నికల గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి..
►ఎలక్షన్ ఏజెంట్‌కి ప్రత్యేక వాహనం అనుమతి ఉండదు. 
►పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ ల వద్ద ఓటర్ లు తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. 
►ఓటర్‌లను తరలించడం చట్ట విరుద్ధం అలా చేస్తే వాహనాలు సీజ్ చేయబడతాయి. 
►కోవిడ్ నియమ నిబంధనలు పాటించి ఓటింగ్‌లో పాల్గొనాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top