గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురి సజీవదహనం | Gas Cylinder Explodes In Miryalaguda Nalgonda District | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురి సజీవదహనం

Jun 5 2026 6:46 AM | Updated on Jun 5 2026 8:45 AM

Gas Cylinder Explodes In Miryalaguda Nalgonda District

సాక్షి, నల్గొండ జిల్లా: మిర్యాలగూడ గాంధీ నగర్‌లో ఘోర ‍ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు సజీవదహనమయ్యారు. మృతులను చంద్రమ్మ(50), లక్ష్మణ్‌(17), ప్రణతి(14)గా గుర్తించారు.

చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే భారీ శబ్దంతో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement