గద్వాల జిల్లా కోర్టు జడ్జి తీర్పు
శాంతినగర్/ ఎర్రవల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ సంచలన తీర్పులు వెలువరించారు. ఇద్దరు బాలికల అత్యాచార కేసులకు సంబంధించి నిందితులకు 35, 25 ఏళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లికి చెందిన ఓ బాలికకు ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన వడ్డె వెంకటరమణ అలియాస్ లక్కీ (23)తో పరిచయం ఏర్పడింది.
ఆ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి హిందూపూర్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి గతేడాది అక్టోబర్ 10న శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న మేజి్రస్టేట్... వెంకటరమణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి 25 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.40 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
మరో ఘటనలో..
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్ర 2017లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కోదండాపురం పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ యాదగిరి విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
కేసు పూర్వాపరాలను విన్న జడ్జి రవికుమార్ నేరస్తుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు బా ధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాల ని తీర్పు వెలువరించారు. నిందితులకు శిక్ష ప డేలా కృషిచేసిన డీఎస్పీ, ఎస్‌ఐలు, న్యాయవా దులు, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.


