breaking news
harichandra
-
తిరుగులేని హీరోయిన్.. పగతో శవాన్ని కూడా వదలని స్టార్ హీరో
నటశిరోమణి 'పుసుపులేటి కన్నాంబ' 1934 నుంచి 1965 వరకు దక్షిణాదిన తిరుగులేని తెలుగు తార. నేటి తరానికి ఈ అద్భుత నటి కథ పరిచయం చేయాల్సిందే. ఇప్పటికీ ఆమె శవం ఎక్కడ అనేది ఒక మిస్టరీనే.. కన్నాంబ పుట్టింది (1912) ఏలూరు. పెరిగింది గుంటూరులో. పెద్ద కుటుంబం. పేరున్న కుటుంబం. తండ్రి తోడబుట్టినవాళ్లు 17 మంది. కుటుంబం మొత్తానికి కన్నాంబ ఒక్కతే కూతురు. మిగతావాళ్లంతా మగపిల్లలే. అమ్మానాన్న, పెదనాన్నలు, బాబాయ్‌ల మధ్య అల్లారు ముద్దుగా పెరిగింది. ఐదో తరగతి వరకూ చదువుకున్న కన్నాంబకు వీధి నాటకాలు చూడటం ఇష్టం. బయట నాటకం చూడటం, ఇంటికొచ్చాక ఆ డైలాగులు చెప్పి, ఇంటిల్లిపాదినీ నవ్వించడం. 11వ ఏట నాటకాలు చూడటం మొదలుపెట్టి, ఆ తర్వాత 'నావెల్ నాటక సమాజం'లో చేరి, బాల తారగా పలు పాత్రలు చేసింది. 1935లో 'హరిశ్చంద్ర' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు కన్నాంబ. ఆ చిత్రంలో హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్ర చేశారామె. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటన కనబర్చి మంచి పేరు తెచ్చుకున్నారు.తప్పు చేస్తే నన్ను నేను చంపేసుకుంటా: కన్నాంబ'సినిమా పరిశ్రమ మనకు సూటవ్వదు. మాయా ప్రపంచం...' హీరోయిన్ అవుతానన్నప్పుడు కన్నాంబ తల్లిదండ్రులు అన్న మాటలివి. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పెరిగిన అమ్మాయి. పద్ధతులు తెలిసిన అమ్మాయి కన్నాంబ. అందుకే అమ్మానాన్నకు మాటిచ్చింది... ‘ఎక్కడా తప్పటడుగు వేయను’ అని. 'నేను ఎవరికీ లొంగను. మీరు తలవొంచుకునే పరిస్థితులు తీసుకు రాను. ఒకవేళ నేను తలవొంచే పరిస్థితి వస్తే నన్ను నేను చంపేసుకుంటాను' కూతురి మాటలు విన్న కన్నాంబ తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్లడానికి అనుమతిచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వందకు పైగా సినిమాల్లో నటించారు.మొదటి సినిమా తర్వాత కన్నాంబ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోడి కోడళ్లు’ తదితర చిత్రాల్లో నటించారామె. సినిమాలు ప్రారంభమైన రోజుల్లో అంటే 30, 40వ దశకంలో ఆమె ఒక సంచలన నటి. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. భారీ సినిమాల్లో ఛాన్సులు, పేరుతో పాటు డబ్బు అన్నీ వచ్చేశాయి. అయినప్పటికీ కన్నాంబ కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ‘ఎవరికీ లొంగను. ఎవరి దగ్గరా తలవంచను’ అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.కన్నాంబకు సమస్యగా మారిన తమిళ నటుడుకన్నాంబ కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ‘ఎవరికీ లొంగను. ఎవరి దగ్గరా తలవంచను’ అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ‘క్యాస్టింగ్ కౌచ్’ అంటూ పలువురు కథానాయికలు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతున్నారు. అప్పట్లో కన్నాంబకు జరిగింది కూడా ఇదే. ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు మెల్లిగా అవకాశాలు తగ్గాయి. చివరికి ఆ నటుడు కన్నాంబ భర్తనూ వదిలిపెట్టలేదు. కన్నాంబ భర్త కడారు నాగభూషణం సినీ నిర్మాత, దర్శకుడు కూడా. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నాక ‘శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం’ కంపెనీ స్థాపించి పలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు. వాటిలో ‘సుమతి, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం’ తదితర చిత్రాలున్నాయి ఈ చిత్రాలకు కడారు నాగభూషణమే దర్శకుడు. బయటి దర్శకులతోనూ సినిమాలు తీశారు. భర్త దర్శకత్వంలో కన్నాంబ నటించారు కూడా.'కన్నాంబ'పై పగపెంచుకున్నాడుకన్నాంబ, నాగభూషణంలు మంచితనానికి చిరునామా అన్నట్లుగా ఉండేవాళ్లట. అడిగినవాళ్లకు కాదనకుండా డబ్బు ఇవ్వడం, సాక్షి సంతకం పెట్టడం లాంటివి వీళ్లకు నష్టాన్ని కలిగించాయి. ఏ నటుడి వల్ల అయితే అవకాశాలు కోల్పోయారో అదే నటుడితో ఓ సినిమా తీసి, నష్టాలపాలయ్యారు. ఆ నటుడితో రెండు మూడు సినిమాలను తమ బేనర్లో నిర్మించడానికి కన్నాంబ, నాగభూషణంలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫస్ట్ సినిమా తీసినప్పుడు తన స్నేహితుడి బేనర్‌కి ఆ సినిమాని ఇవ్వమని నటుడు కోరితే కాదనకుండా ఇచ్చేశారు. అయితే 30 శాతం మాత్రమే చెల్లించి, మిగతా 70 శాతం డబ్బు ఇవ్వకపోయినా కన్నాంబ దంపతులు అతనితో రెండో సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ఆ సినిమా సగంలో ఉండగానే అతనికి రాజకీయాల వైపు మక్కువ ఏర్పడి, మిగతాది పూర్తి చేయకపోవడంతో నష్టం మిగిలింది. ‘‘ఏ వ్యక్తి మీద అయినా వారి జీవితాన్ని నాశనం చేసేంత కోపం ఉండకూడదు. కానీ తన అమ్మమ్మపై ఆ నటుడు పగబట్టాడని పేరు చెప్పుకుండా కన్నాంబ మనవడు గతంలో ఒకసారి అన్నారు. ఆమె కెరీర్‌ని నాశనం చేయడంతో పాటు తన తాతగారికీ అవకాశాలు లేకుండా చేశాడని కన్నాంబ మనవడు పసుపులేటి దేవీ చౌదరి అన్నారు.కన్నాంబ శవం మాయం'ఆత్మబలం' (1964) కన్నాంబ చివరి సినిమా. అదే ఏడాది మే 7న ఆమె తుది శ్వాస విడిచారు. ఏ అనార్యోగమూ లేదు. బతికున్న రోజుల్లో జ్వరం అనేది ఎరగని కన్నాంబ ప్రశాంతంగా కన్ను మూశారు. అయితే దురదృష్టం ఏంటంటే.. మనిషి చనిపోయాక కూడా ఆ నటుడు పగ తీర్చుకున్నాడని దేవీ చౌదరి అంటున్నారు. కన్నాంబ భౌతికకాయాన్ని ఖననం చేశారు. అక్కడ సమాధి కట్టించాలన్నది కుటుంబ సభ్యుల ఆలోచన. అయితే ఈలోపే శవం మాయమైంది. శరీరం మీద ఉన్న నగల కోసం దొంగలే మాయం చేశారని కొందరు అంటే, కాదు ఇది ఆ నటుడి పనే అని మనవడు తెలిపారు. ఏం జరిగిందో దేవుడికే ఎరుక. ఆమె శవాన్ని ఎత్తుకెళ్లి, నగలన్నీ తీసేసి శవాన్ని ఎక్కడో పారవేశారు అన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పటికీ, ఆ శవం ఏమైందో ఇప్పటికి తెలియదు. ఇది ఆమె జీవితంలోని విషాద ఘట్టంగా, తెలుగు సినీ చరిత్రలో ఒక విషాదకథగా నిలిచిపోయింది. -
పల్నాడులో ఘోరం.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్నాడు, సాక్షి: కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరే ఆయన్ని కిడ్నాప్ చేసినట్లు తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు. -
సత్యానికి పట్టం కట్టిన హరిశ్చంద్రుడు
హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః పురూరవాః సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః అంటే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు కార్తవీర్యార్జునుడు అనే ఈ ఆరుగురిని కలిపి షట్చక్రవర్తులు అంటారు. పురాణాలు వీరిని అత్యంత విశిష్ఠులైనవారిగా కీర్తించాయి. అటువంటి వారి గురించి తెలుసుకోవడం స్ఫూర్తిదాయకం. ముందుగా హరిశ్చంద్రుడి గురించి తెలుసుకుందాం. సత్యసంధతలో ఆదర్శవంతమైన వాడు, మానవాళికంతటికీ మార్గదర్శకుడు హరిశ్చంద్రుడు. సత్యహరిశ్చంద్రుడి కథ మార్కండేయ పురాణంలో ఉంది. త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. సూర్యవంశ రాజుల్లో సుప్రసిద్ధుడు. అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. ఏకపత్నీ వ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సంఘటన హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలకు గురిచేసి, మరెన్నో మలుపులు తిప్పింది. అదేమంటే... ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు కాడని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అన్నాడు. అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవటానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంతో ధనం అవసరమవుతుందనీ, ఆ ధనం కావాలని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్లిపోయాడు. కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్లాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో, సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశారు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలనుకున్నాడు. అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కర లేదని, తమను వివాహం చేసుకోమని కోరారు. కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్నీవ్రతుడినని, రెండోసారి పెళ్లిచేసుకోవటం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి, సున్నితంగా ఆ కన్యలను పంపించాడు. విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటపెట్టుకొని వచ్చి హరిశ్చంద్రుడిని వారి కోరిక తీర్చమన్నాడు. తన రాజ్యాన్నయినా వదులుకుంటాను కానీ, ఏకపత్నీవ్రతాన్ని విడిచి పెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు హరిశ్చంద్రుడు. వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్లిపొమ్మన్నాడు. హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని, కొంత సమయమిస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుడిని వేడుకున్నాడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవటానికి నక్షత్రకుడు అనే తన శిష్యుడిని పంపాడు. హరిశ్చంద్రుడి వెనుకనే బయలు దేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాలపాలు చేశాడు. ‘సొమ్ము ఇస్తానని అనలేదు అని’ ఒక్క అబద్ధం చెబితే చాలు, తాను వెంటనే వెళ్లిపోతానన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలనుభవిస్తూ చివరకు కాశీ నగరానికి చేరాడు. అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌశికుడి ఇంట్లో పనులు చేస్తోంది. అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. దాంతో కుమారుడికి అంత్యక్రియలు చేయటానికి శవాన్ని తీసుకొని చంద్రమతి శ్మశానికి వెళ్లింది. అక్కడ వీరబాహుడికి సేవకుడిగా, కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే, కాటి సుంకం చెల్లించి తీరాలని పట్టుబట్టాడు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనంది చంద్రమతి. అప్పుడు హరిశ్చంద్రుడు అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అన్నాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరొకరెవరికీ కనపడదని, అది తనకు వరమని కనుక కాటికాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయివుంటాడనుకుని అప్పుడు తన విషయాన్నంతా హరిశ్చంద్రుడికి చెప్పింది. ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు. అంత రాత్రివేళ చంద్రమతి నగరంలోకి వెళుతుండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుడిని ఎవరో దొంగలు చంపి, అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజభటులు ఆ దొంగలను తరుముకు రాసాగారు. ఆ దొంగలు పరుగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాకుమారుడిని హత్యచేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటులు ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజాజ్ఞను అమలు పరచడం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగవేయబోయాడు. విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడులాంటి రుషులు అక్కడకు వచ్చి చేరి అబద్ధం ఆడని, ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు. విశ్వామిత్రుడు తాను ఓడిపోయానని ఒప్పుకోవటంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పుష్పవృష్ఠి కురిపించారు. ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు. సత్య నిరతిని తప్పక సత్యహరిశ్చంద్రుడిగా పేరు పొందాడు. - డి.వి.ఆర్. భాస్కర్ -
యువకుడి ఆత్మహత్య
పెద్దపప్పూరు: ముచ్చుకోట గ్రామానికి చెందిన హరిచంద్ర (23) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన సత్యనారాయణ కొడుకు హరిచంద్ర చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడేవాడు. బెంగుళూరు, హైదరాబాద్, కర్నూలు నగరాల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నోయేండ్లు గతించిపోయిననూ..