యువకుడి ఆత్మహత్య | man suicides in muchukota | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Sep 13 2017 10:10 PM | Updated on Nov 6 2018 8:28 PM

ముచ్చుకోట గ్రామానికి చెందిన హరిచంద్ర (23) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

పెద్దపప్పూరు: ముచ్చుకోట గ్రామానికి చెందిన హరిచంద్ర (23) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన సత్యనారాయణ కొడుకు హరిచంద్ర చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడేవాడు. బెంగుళూరు, హైదరాబాద్, కర్నూలు నగరాల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement