నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు  | Free Child Heart Operation in NIMS Hyderabad | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు 

Published Mon, Sep 11 2023 1:52 AM | Last Updated on Mon, Sep 11 2023 1:52 AM

Free Child Heart Operation in NIMS Hyderabad - Sakshi

లక్డీకాపూల్‌: గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్‌లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప తెలిపారు. నవజాత శిశువులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

బ్రిటన్‌లోని ఆల్డర్‌ హే చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ కార్డియాక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిలోఫర్‌ సర్జన్లు, నిమ్స్‌ కార్డియోథొరాసిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్‌లో ఈ శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు వివరించారు.

 ‘హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ చార్లీస్‌ హార్ట్‌ హీరోస్‌ క్యాంప్‌’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగనున్నాయని బీరప్ప పేర్కొన్నారు. తమ చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 040–23489025 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement