breaking news
Birappa
-
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లక్డీకాపూల్: గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్‌లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. నవజాత శిశువులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిలోఫర్ సర్జన్లు, నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్‌లో ఈ శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు వివరించారు. ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగనున్నాయని బీరప్ప పేర్కొన్నారు. తమ చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 040–23489025 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
హత్య చేసి.. ఆపై ఉరి వేసుకుని..
టేక్మాల్: మండలంలోని కాద్లూర్ గ్రా మంలో అనుమానాస్పదస్థితిలో ఓ ఇంట్లో ఇద్దరు మరణించిన కేసులో మిస్టరీ వీడింది. బీరప్ప అనే వ్యక్తి రత్నకుమారి గొంతు నులిమి చంపిన తరువాత భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. వివరా లు ఇలా... కాద్లూర్ గ్రామానికి చెందిన పోతుల బొగుడ బీరప్ప(32) కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటూ షాపూర్‌లోని ఓ కంపేనిలో పని చేస్తున్నాడు. రత్నకుమారి(38) బీరప్పతో పాటు అదే కంపెనీలో పని చేస్తుంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. స్వగ్రామమైన కాద్లూర్‌కు వెళ్లి సామగ్రి తీసుకొస్తానని బీరప్ప తన కుటుంబ సభ్యులకు చెప్పి ఈనెల 26న ఇంటినుంచి బయలు దేరాడు. డబ్బులు తీసుకువస్తానంటూ రత్నకుమారి వారింట్లో చెప్పి బయలుదేరింది. బీరప్ప, రత్నకుమారి ఇద్దరు కలిసి మంగళవారం కాద్లూర్‌కు వచ్చారు. కాద్లూర్లోని ఇంటికి చేరుకున్న వారిద్దరు బయటకు రాలేదు. శుక్రవారం ఇంటి నుంచి వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పరి శీలించగా రెండు మృతదేహాలు వెలుగు చూశాయి. రత్నకుమారి మృతదేహం ఓ పక్కన పడి ఉండగా బీరప్ప శవం వేలాడుతూ కన్పించింది. అక్కడే ఉన్న బ్యాగ్ లో ఐడీ కార్డులతోపాటు రత్నకుమారి ఫొ టోలు, ఆమె కూతురైన సినీ ఆర్టిస్ట్ ఫొటోలతోపాటు రూ.19,540 నగదు దొరి కింది. డబ్బుల విషయమై గొడవ జరిగి ఉంటుందని... వచ్చిన రోజే బీరప్ప తన ఇంట్లో తలుపులు వేసి రత్నకుమారిని గొంతునులిమి చంపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ తరువాత భయానికిలోనైన బీరప్ప ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ తెలిపారు. రత్నకుమారిని గొంతునులిపి చంపినట్లు పోస్టుమార్టంలో తేలిందన్నారు. కన్నతల్లి ముఖం చూడని కూతురు.. రత్నకుమారి హత్యకు గురైన విషయం తెలుసుకున్న ఆమె కూతురైన సినీ ఆర్టిస్ట్ శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చింది. అయితే కన్నతల్లిని కడసారి చూడడానికి ఇష్టపడలేదు. మృతదేహాన్ని సైతం తీసుకెళ్లకుండా స్థానికులకే డబ్బులిచ్చి అంత్యక్రియలు జరిపించింది.