స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం | Four Members Elected Telangana Legislative Council In The Quota Of Local Bodies Were Sworn | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Feb 22 2022 2:59 AM | Updated on Feb 22 2022 3:02 AM

Four Members Elected Telangana Legislative Council In The Quota Of Local Bodies Were Sworn - Sakshi

ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలసి కృతజ్ఞతలు తెలుపుతున్న  ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కోటిరెడ్డి, దండె విఠల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికైన నలుగురు సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రొటెమ్‌ చైర్మన్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ కొత్త సభ్యులతో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. తానిపర్తి భానుప్రసాద్‌రావు (కరీంనగర్‌), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్‌), దండె విఠల్‌ (ఆదిలాబాద్‌), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ)ప్రమా ణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

వీరికి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత నూతన ఎమ్మెల్సీలు ప్రగతిభవన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఎమ్మెల్సీలతో కలసి సీఎం కేసీఆర్‌ భోజనం చేశారు. అనంతరం ఆయన నారాయణఖేడ్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement