రెండు పులుల మధ్య కొట్లాట | Sakshi
Sakshi News home page

రెండు పులుల మధ్య కొట్లాట

Published Mon, Jan 8 2024 4:41 AM

A fight between two tigers - Sakshi

కాగజ్‌నగర్‌ రూరల్‌: రెండు పులులు పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో ఓ ఆడ పులి మృతి చెందింది. కుము రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. చీఫ్‌ ఫారెస్టు కన్జ ర్వేట ర్‌ శాంతారాం ఆది వారం మీడియాకు ఈ వివరాలు వెల్ల డించారు. నాలుగు రోజుల క్రితం రెండు పులులు పరస్పరం దాడికి దిగాయని, ఓ పశువుల కాపరి తమకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టామని తెలిపారు.

ఈ ఘటనలో సుమారు రెండు సంవత్సరాల వయసున్న ఆడ పులి మృతి చెందిందన్నారు. 200 మీటర్ల విస్తీర్ణంలో పులుల మధ్య కొట్లాట జరిగినట్లు ఆనవాళ్లను గుర్తించామని వివరించారు. మృతి చెందిన పులికి సంబంధించిన శాంపిళ్లను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తున్నామని చెప్పారు.

రిపోర్టు రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. విషప్రయోగం వల్ల పులి మృతి చెందిందనే ఆరోపణలు సరికావన్నారు. సాధారణంగా ఒక పులి ఆవాసం ఉండే ప్రాంతంలోకి మరో పులి వచ్చినప్పుడు ఘర్షణ జరుగుతుందని తెలిపారు. ఈ తరహా ఘర్షణతోనే పులి మృతిచెందిందని శాంతారాం వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement