చేతులు కట్టేసి... న్యూడ్‌ వీడియో తీసి.. | Female techie harassed after meeting on Snapchat | Sakshi
Sakshi News home page

చేతులు కట్టేసి... న్యూడ్‌ వీడియో తీసి..

Jun 28 2026 1:01 AM | Updated on Jun 28 2026 1:01 AM

Female techie harassed after meeting on Snapchat

నాగతేజ

యువతి నుంచి రూ.1.10 లక్షల దోపిడీ

గచ్చిబౌలి (హైదరాబాద్‌): స్నాప్‌చాట్‌లో పరిచయమైన మహిళాటెకీకి మాయమాటలు చెప్పి హోటల్‌కు రప్పించి అనంతరం కత్తితో బెదిరించి చేతులు కట్టేసి, న్యూడ్‌ వీడియో తీసి ఓ యువకుడు రూ.1.10 లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలి  పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సూదివారిపాలెంకు చెందిన కిలారి నాగతేజ అలియాస్‌ నాని (24) గతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశాడు. 

మాదాపూర్‌లోని హోలా కో లివింగ్‌ పీజీ హాస్టల్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి స్నాప్‌చాట్‌ యాప్‌ ద్వారా ఓ ఐటీ ఉద్యోగిని పరిచయమైంది. నాగతేజ ఐదు రోజుల క్రితం గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ సమీపంలోని ఎల్లో స్టోన్‌ హోటల్‌లో ఫేక్‌ డాక్యుమెంట్లతో రూమ్‌ అద్దెకు తీసుకున్నాడు.  యువతికి మాయమాటలు చెప్పి రాత్రి 8 గంటలకు హోటల్‌కు రప్పించాడు. 

అనంతరం యువతి చేతులు కట్టేసి, కత్తితో బెదిరించి న్యూడ్‌ వీడియోలు, ఫొటోలు తీశాడు. డబ్బులు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో, మీ తల్లిదండ్రులకు ఆ వీడియో పంపిస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. గత్యంతరం లేని పరిస్థితిలో యువతి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. అనంతరం యువతి ఫోన్‌ నంబర్‌తో క్యాబ్‌ బుక్‌ చేసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించగా నాగతేజను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరో ఇద్దరు, ముగ్గురు యువతుల న్యూడ్‌ వీడియోలు కూడా అతని సెల్‌ ఫోన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, నిందితుడి తల్లిదండ్రులు చిన్న కొడుకు చదువు కోసం ఉన్న ఒక్క ఎకరం పొలం అమ్మేసి రూ.10 లక్షలు తమ బ్యాంక్‌ ఖాతాల్లో ఉంచుకున్నారు. వారికి తెలియకుండానే ఇద్దరి ఖాతాల నుంచి మొత్తం డబ్బును నాగతేజ కాజేసి, క్రికెట్‌ బెట్టింగ్‌లలో పోగొట్టాడని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement