సోషల్‌ టెక్‌ నిపుణుల కోసం ఫెలోషిప్‌ ప్రోగ్రాం | Fellowship program for social tech experts | Sakshi
Sakshi News home page

సోషల్‌ టెక్‌ నిపుణుల కోసం ఫెలోషిప్‌ ప్రోగ్రాం

Jun 30 2026 3:54 AM | Updated on Jun 30 2026 3:54 AM

Fellowship program for social tech experts

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలను రూపొందించే సాంకేతిక సంస్థ ఎక్విప్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ టెక్నాలజీస్‌ తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖకు చెందిన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌తో (టాస్క్‌) కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సరికొత్త సోషల్‌ టెక్‌ ప్రొఫెషనల్స్‌ను (సామాజిక సాంకేతిక నిపుణులు) తయారు చేయడం కోసం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఎక్విప్‌ ఫెలోస్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించాయి. 

అకడమిక్‌ విద్యకు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎక్విప్‌ రూపొందించిన ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి అవసరమైన నైపుణ్యాలపై టాస్క్‌ శిక్షణ ఇస్తుంది. ఈ ఫెలోషిప్‌ 6–12 నెలల పాటు ఉంటుంది. ఇందులో క్లాస్‌రూమ్‌ బోధన, టెక్నాలజీ శిక్షణతో పాటు లైవ్‌ ప్రాజెక్టులలో క్షేత్రస్థాయి పని అనుభవం కల్పిస్తారు.

ఫెలోషిప్‌ కాలంలో అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తుంది. ఈ శిక్షణ పొందిన నిపుణులు ప్రభుత్వాలు, సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు చేపట్టే పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్, డిజిటల్‌ సామాజిక ప్రాజెక్టుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement