రాష్ట్రస్థాయి వార్తా ఫొటోగ్రఫీ పోటీల విజేతలను ప్రకటించిన ఫొటో జర్నలిస్టుల సంఘం
హైదరాబాద్: ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా తె లంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉత్త మ వార్తా ఫొటోగ్రఫీ పోటీలు– 2026 విజేతలను ఆ సంఘం అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె. ఎన్.హరి ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్ లోని సంఘం కార్యాలయంలో ప్రకటించారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 102 ఎంట్రీలు, 306 ఛాయా చిత్రాలు వచ్చాయని చెప్పారు.
జ్యూరీ సభ్యులైన ప్రముఖ సంపాదకుడు దేవులపల్లి అమర్, ఛాయాచిత్రగ్రహకుడు, నటుడు కొమ్మిడి విశ్వేందర్‌రెడ్డి, కమలా సుధాకర్‌రెడ్డి వాటిని పరిశీలించి ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేశారని వారు తెలిపారు. ఈ పోటీల్లో ద్వితీయ బహుమతిని కె.బజరంగ్ ప్రసాద్ (సాక్షి, నల్లగొండ) గెలుచుకున్నారు. మరో 10 మందిని కన్సొలేషన్ బహుమతులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రస్థాయి ఉత్తమ వార్తాచిత్రాల ప్రదర్శన ప్రారంభమవుతుందని.. త్వరలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని వారు తెలిపారు.

బజరంగ్ తీసిన చిత్రం


