ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి | Fee Reimbursement Dues Must Be Cleared Jajula Srinivas Goud | Sakshi
Sakshi News home page

ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

Jun 23 2026 10:40 PM | Updated on Jun 23 2026 10:40 PM

Fee Reimbursement Dues Must Be Cleared Jajula Srinivas Goud

భట్టి విక్రమార్కను కలిసిన వారిలో జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్

  • ఫీజు రియంబర్స్‌మెంట్‌ స్కీమును పాత పద్ధతిలోనే అమలు చేయాలి
  • కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి
  • డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కోరిన జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్‌: గత నాలుగు సంవత్సరాలుగా 14 లక్షల మంది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, గతంలో ఉన్న మాదిరిగానే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీములు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్.. ఉపముఖ్యమంత్రి బట్టి  విక్రమార్కను కోరారు.

హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో జాజుల శ్రీనివాస్ గౌడ్ బేటి అయ్యారు ఈ సందర్భంగా బీసీ డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎంకు జాజుల అందజేశారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఫీజులు చెల్లించాలని ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు వేధిస్తున్నాడంతో అనేక మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు, కాంట్రాక్టర్లకు బిల్లులను ఆపి పేద విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు

 అలాగే 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఏ విధంగా అమలు చేశారో ఇప్పుడు కూడా జీవో నెంబర్ 8, 9 లను రద్దుచేసి పాత పద్ధతిలోని ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలని ఆయన కోరారు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పదివేల ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి పూర్తి ఫీజులను ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటాం: భట్టి
ఫీజుల రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఫీజుల బకాయిల చెల్లింపు పై రెండు మూడు రోజుల్లోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జాజులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement