పాలకులు మరిచారు.. రైతులే నిర్మించుకున్నారు!

సాక్షి, రంగారెడ్డి: పరిగి మండలంలోని చిగురాల్‌పల్లి గ్రామ సమీపంలోని వాగుపై వంతెన లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన సగం మంది రైతుల వ్యవసాయ భూములు వాగు అవతలివైపు ఉన్నాయి. వారు వాగు దాటే పొలాలకు వెళ్లాలి. సమీప గ్రామమైన రుక్కుంపల్లికి వెళ్లాలన్నా ఆ వాగు దాటాల్సిందే. వర్షాకాలంలోనైతే ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుతుంటారు. తమ కష్టాలు తీర్చాలని ప్రజాప్రతినిధులకు, నాయకులకు దశాబ్దకాలంగా మొరపెట్టుకుంటునే ఉన్నారు. (తెలంగాణలో 1873 పాజిటివ్, 9 మంది మృతి)
వాగుపై వంతెన నిర్మిస్తామని నాయకులు హామీ ఇస్తున్నా.. అమలు చేయడం లేదు. ఇక.. ఎవరికోసమే చూడడం కంటే తామే వంతెన వేసుకోవాలని రైతులంతా నిర్ణయించకున్నారు. అందరూ చేయిచేయి కలిపి కర్రలు, తాళ్లతో సుమారు 50 మీటర్ల పొడవుతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. మనుషులు, మేకలు, గొర్రెలు ఆ తాళ్ల వంతెనపై నుంచి వెళుతుఉండగా.. బరువు ఎక్కువగా ఉండే ఎద్దులు, గేదెలు వాగులోంచి వెళుతున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి