సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, అతడి ఆత్మహత్యకు బెదిరింపులే కారణమా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన అవ శేఖర్(25) మంగళవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రవి ఇటీవలే పంచాయతీ ఎన్నికల సందర్బంగా తన గ్రామంలో వార్డు మెంటర్‌గా పోటీ చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ క్రమంలో అతడిని ఎన్నికల్లో నుంచి తప్పుకోవాలనే బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.
దీంతో, మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న శేఖర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ సందర్బంగా శేఖర్ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బంధువులు ఆందోళనకు దిగారు. అయితే, ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని శేఖర్‌గా గుర్తించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. అనంతరం, పోస్టుమార్టం కోసం శేఖర్ మృతదేహాన్ని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. కంసాన్‌పల్లిలో గ్రామస్థులు పెద్దఎత్తున ుగుమికూడి ఆందోళన చేపట్టారు. శేఖర్ ఆత్మహత్యకు కొందరి బెదిరింపులే కారణమని ఆరోపిస్తున్నారు.


