వారికి వారే మాట్లాడుకొని వెళ్లారు! 

Fact Finding Committee Report On BJP Leaders - Sakshi

టీఆర్‌ఎస్‌ నాయకులను కలిసిన  బీజేపీ నేతల వ్యవహారంపై కమిటీ నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: లింగోజీగూడ కార్పొరేటర్‌ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కోసం పలువురు కార్పొరేటర్లతోపాటు బీజేపీ ముఖ్య నేతలు రాంచందర్‌రావు, శేఖర్‌రావు తదితరులు టీఆర్‌ఎస్‌ నేతలను, మంత్రి కేటీఆర్‌ను  కలిసిన విషయంలో వారికి వారే సొంతంగా నిర్ణయం తీసుకొని వెళ్లారని నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను ఆయనకు అందజేసింది. ఈ విషయంపై బండి సంజయ్‌కి సమాచారం ఇవ్వకపోవడం పొరపాటేనని నేతలు కమిటీ ముందు ఒప్పుకున్నారు. అయితే నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది.

చదవండి: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌   
అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top