నిజామాబాద్ అర్బన్ : గంజాయి ముఠాను నిలువరించే క్రమంలో ముఠా సభ్యులు కారుతో మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సమాచారం నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులకు చేరింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు నగర శివారులోని మాధవనగర్ వద్ద శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గంజాయి ముఠాను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారువద్దకు వెళ్లగా నిర్మల్‌కు చెందిన గంజాయి ముఠా సభ్యులు కారుతో ఢీకొట్టాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇద్దరు గంజాయి ముఠా సభ్యులు మహమ్మద్ సొఫియొద్దీన్, సయ్యద్ షోయల్ లను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


