మావో‌ ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్‌ సర్వే | DGP Mahender Reddy Area Survey In Maoist Affected Areas | Sakshi
Sakshi News home page

మావోయిస్టు‌ ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్‌ సర్వే

Sep 2 2020 2:08 PM | Updated on Sep 2 2020 3:29 PM

DGP Mahender Reddy Area Survey In Maoist Affected Areas - Sakshi

సాక్షి, అసిఫాబాద్‌: ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టు‌ ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీస్తున్నారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు విషయమై కూడా చర్చ కొనసాగుతోంది. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?)

Advertisement
 
Advertisement
Advertisement