ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై కేసులు ఉపసంహరించాలి | Demand Withdrawal Of Cases Against Professor Nageshwar: Roundtable Meeting | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై కేసులు ఉపసంహరించాలి

Jun 5 2026 5:39 AM | Updated on Jun 5 2026 5:39 AM

Demand Withdrawal Of Cases Against Professor Nageshwar: Roundtable Meeting

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి. చిత్రంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్, కె. శ్రీనివాస్, కూనంనేని, కె. వీరయ్య, పశ్య పద్మ తదితరులు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో డిమాండ్‌

భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది: జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

నాగేశ్వర్‌ గొంతును కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది: కూనంనేని

అభిప్రాయ భేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి: కోదండరాం

కేసులకు భయపడను: ప్రొ. నాగేశ్వర్‌  

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాజకీయ విశ్లేషకుడు కె.నాగేశ్వర్‌పై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రొ.నాగేశ్వర్‌పై జరుగుతున్న కక్షపూరిత దాడులు, సోషల్‌ మీడియా ట్రోలింగ్, కేసులను ఖండిస్తూ గురువారం బషీర్‌బాగ్‌ దేశోద్దారక భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.కోదండరాం, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, సీనియర్‌ సంపాదకుడు కె.శ్రీనివాస్, సీపీఎం నేత ఎస్‌.వీరయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు. కూనంనేని మాట్లాడుతూ నాగేశ్వర్‌ గొంతును కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. కోదండరాం మాట్లాడుతూ అభిప్రాయ భేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రొ.నాగేశ్వర్‌ మాట్లాడుతూ కేసులకు భయపడబోనని, ప్రజా సమస్యలపై తన రచనలు, విశ్లేషణలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సమావేశం చివర్లో భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాలని, నాగేశ్వర్‌పై కేసులను ఎత్తేయాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో సీపీఐ నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈ.టి. నరసింహా, వి.ఎస్‌.బోస్, బి.స్టాలిన్‌ పొల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement