Customs Officers Seized Gold In Chocolate At Shamshabad Airport - Sakshi
Sakshi News home page

Shamshabad Airport: ఇదేం తెలివిరా నాయనా.. చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. చివరికి!

May 2 2023 8:08 PM | Updated on May 2 2023 9:20 PM

Customs Officers Seized Gold In Chocolate At Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 269 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోపల రూ.16.5 లక్షల విలువైన బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా రవాణా  చేస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

మంగళవారం ఉదయం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికులను అధికారులు పరిశీలించగా.. 269 గ్రాముల బంగారాన్ని చాక్లెట్‌ కవర్లలో చుట్టి తీసుకొచ్చినట్లు గుర్తించారు అట్టపెట్టెలో ఉంచిన 13 చాక్లెట్లలో 13 చిన్న బంగారు ముక్కలను అమర్చి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద 269 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.


చదవండి: ‘గీత కార్మికుల బీమా’పై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement