Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి!

Couple Reunited After 6 Yrs Separation With Help Of Daughter - Sakshi

కరీంనగర్‌: ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్‌ కోనసీ మ జిల్లా సకినేటి మండలం అంతర్వేదిలో 2016లో తండ్రితోపాటు కనిపించకుండా పో యిన చిన్నారి అక్ష తల్లిదండ్రుల చెంతకు చేరింది. జిల్లా అధికారుల కృషితో పాపను సోమవారం తల్లిదండ్రులు ద్వారక, రవికుమార్‌కు సీ డబ్ల్యూసీ అధికారులు అప్పగించారు. వివరా లు.. ఈనెల 11న జిల్లాలోని సైదాపూర్‌ మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన మహిళ వద్ద అక్షను గ్రామస్తులు గుర్తించారు.

బాలికకు ఎవరూ లే రని, ఉంటే చేరదీయాలని వాట్సాప్‌ ద్వారా స ర్పంచ్‌ కొత్త రాజిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ తి రుపతిరెడ్డి ప్రతిగ్రూప్‌లో షేర్‌ చేస్తూ సైదాపూర్‌ ఎస్‌ఐ సెల్‌ నంబర్‌ను పొందుపరిచారు. ఈక్రమంలో పాప కోసం రెండు కుటుంబాలకు చెందిన వారు అధికారులను ఆశ్రయించారు. కానీ పూర్తి ఆధారాలతో రావాలని శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. సోమవారం అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన దంపతులు పూర్తి ఆధారాలు సమర్పించారు.  దీంతో  పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

అధికారులను అభినందించిన కలెక్టర్‌
కరీంనగర్‌: చిన్నారి అక్షను సోమవారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పాప వివరాలను కలెక్టర్‌ తెలుసుకున్నారు. అనంతరం బాగా చదువుకొని మంచి స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. చిన్నారికి చాక్లెట్లు, పెన్ను, పుస్తకం అందజేశారు. పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కృషిచేసిన అధికారులను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సంధ్యరాణి, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, సభ్యులు రెండ్ల కళింగశేఖర్, రాధ, అర్చన, విజయ్, డీసీపీఓ శాంత, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 కోఆరి్డనేటర్‌ సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top