హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ రావాలంటూ హైకమాండ్ ఆదేశించింది. రేపు(ఆదివారం, అక్టోబర్ 11వ తేదీ) రాత్రికి ఢిల్లీ చేరుకోవాలని స్పష్టం చేసింంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నేతలు ఢిల్లీకి రావాలని సూచించింది.
ఈ మేరకు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లు చేసి విషయాన్ని చేరవేస్తున్నారు. రేపు ఢిల్లీ వెళ్లడానికి సూచించిన కాంగ్రెస్ ముఖ్య నేతలంతా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభం: సీఎం రేవంత్


