నేడు మీర్‌ఖాన్‌పేటకు సీఎం రేవంత్‌రెడ్డి | cm revanth reddy visit netzero city at meerkhanpet on august 01 | Sakshi
Sakshi News home page

నేడు మీర్‌ఖాన్‌పేటకు సీఎం రేవంత్‌రెడ్డి

Aug 1 2024 6:06 AM | Updated on Aug 1 2024 6:06 AM

cm revanth reddy visit netzero city at meerkhanpet on august 01

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీతోపాటు పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన

సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగం

కందుకూరు: రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించను న్నారు. అధికారులు, నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ శశాంక బుధవారం సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు. నెట్‌ జీరో సిటీలో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, రైతులకు ప్లాట్లు కేటాయించనున్న లేఅవుట్‌లో అడ్వాన్స్‌ టెక్నికల్‌ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్‌ భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4 గంటలకు అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన వెంట టీజీఐఐసీ ఈడీ పవన్, ఆర్డీఓ సూరజ్‌కుమార్, డీఈఓ సుశీంధర్‌రావు, తహసీల్దార్‌ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement