
శాంతమ్మ చిత్ర పటం వద్ద నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్
పాలమూరు: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం మహబూబ్‌నగర్– భూ త్పూర్ రోడ్డులో లోపాలకొండ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన మంత్రి మాతృమూర్తి శాంతమ్మ దశదినకర్మకు సీఎం హాజరయ్యారు. మొదటగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి రోడ్డుమార్గంలో మంత్రి వ్యవసాయక్షేత్రానికి వెళ్లి శాంతమ్మ సమాధి వద్ద నివాళులర్పించారు. ఆమె చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రితోపాటు కుటుంబసభ్యులకు ధైర్యం కల్పించారు. శాంతమ్మ, నారాయణగౌడ్ దంపతులపై ముద్రించిన పుస్తకాన్ని సీఎంకు శ్రీనివాస్‌గౌడ్ అందించారు. ఆ తర్వాత అక్కడే భోజనం చేసిన సీఎం మధ్యాహ్నం 1.20 గంటలకు మహ బూబ్‌నగర్ చేరుకుని, 2.20 గంటలకు హైదరాబాద్‌కు పయనమయ్యారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.’