ఎట్‌ హోంకు సీఎం దూరం | CM KCR Not Attend For Tamilisai Soundararajan Party At Rajbhavan | Sakshi
Sakshi News home page

ఎట్‌ హోంకు సీఎం దూరం

Aug 16 2023 1:57 AM | Updated on Aug 16 2023 1:58 AM

CM KCR Not Attend For Tamilisai Soundararajan Party At Rajbhavan - Sakshi

రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, సీఎస్‌ శాంతికుమారి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన తేనీటి విందుకు ఎప్పటిలాగే సీఎం కేసీఆర్‌ గైర్హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ముఖ్య నేతలు సైతం ఈసారి హాజరు కాలేదు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్,టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, సీపీఐ మహిళా నేత పశ్యపద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గవర్నర్‌ అతిథులందరి వద్దకు స్వయంగా వెళ్లి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌గా ఇదే చివరి తేనీటి విందా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, అంతా దేవుడి చేతిలో ఉందని గవర్నర్‌ తమిళిసై స్పందించారు. రాజ్‌భవన్‌లో పెండింగ్‌ బిల్లులతో పాటు ఇతర ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు విముఖత చూపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement