తక్షణమే ఒక డీఏ

CM KCR Declares Holiday On October 26th - Sakshi

ఇకపై ప్రతి ఆర్నెళ్లకోసారి గడువులోగా రాష్ట్రంలో డీఏ ప్రకటన

కేంద్రం డీఏ ప్రకటించాక ఆ మేరకు హెచ్చుతగ్గుల సర్దుబాటు

ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తాం

సీఎం కేసీఆర్‌ హామీ.. దసరాకు మరుసటి రోజు.. 26న సెలవు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక కరువు భత్యం(డీఏ)ను వెంటనే చెల్లిం చాలని ఆర్థికశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. డీఏ విషయంలో ప్రస్తుత విధానాన్ని మార్చా లన్నారు. ‘ప్రస్తుతం డీఏ ఎంతనే విష యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్రాలు అను సరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మూడు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండు డీఏల విష యంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రక టించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నది. ఫలితంగా బకా యిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగు లకు సకాలంలో డీఏ అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి.

ప్రతీ 6నెలలకు ఒకసారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ  నిర్ణయించాలి.కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డీఏ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతం చెల్లించాలి. 2.5గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లిం చాలి. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారుచేయాలి. కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటాం’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటిం చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవుగా నిర్ణయిస్తూ షెడ్యూల్‌ రూపొందించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. 

ఉద్యోగుల విరాళం రూ. 33 కోట్లు
వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.33 కోట్లను విరాళంగా అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అంగీ కార పత్రాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో శుక్రవా రం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్లు, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించనున్నా రు. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలకు సంబంధించిన పలు విజ్ఞప్తుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరి ష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమం త్రిని కలిసివారిలో టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారా యణ, టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయ కంటి ప్రతాప్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌ ఉన్నారు

రాష్ట్ర బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష
కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020–21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ‘కరోనా లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడింది. కేంద్ర జీడీపీ కూడా మైనస్‌ 24 శాతానికి పడిపోయింది. దీని ప్రభావం రాష్ట్రాలపై పడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంతో వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాలి. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలి. మొత్తం బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానిక నివేదిక ఇవ్వాలి’అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top