ఎస్‌పీఎఫ్‌లోకి కేంద్ర బలగాల సిబ్బంది

Central Forces Personnel Into The SPF - Sakshi

డిప్యూటేషన్‌పై తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు

కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర హోంశాఖ 

ఈ వ్యవహారంతో తమకు నష్టమని ఇక్కడి సిబ్బంది ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కీలకమైన వ్యవస్థల భద్రతను పర్యవేక్షిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌)లోకి కేంద్ర సాయుధ బల గాల సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్న ట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ముఖ్యమైన దేవాలయాలు, నీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్లాంట్లు.. ఇలా కీలకమైన వ్యవస్థల భద్రతను ఎస్‌పీఎఫ్‌ సాయుధ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఎస్‌పీఎఫ్‌లోకి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందిని రెండు నుంచి ఐదేళ్ల పాటు డిప్యూటేషన్‌పై తీసుకువచ్చి భద్రతలో భాగస్వామ్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

సిబ్బందిలో ఆందోళన.. 
ఉమ్మడి రాష్ట్రంలో 1991లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటైంది. 1994లో కేంద్ర బలగాల సిబ్బందిని డిప్యూటేషన్‌పై ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్లలో ఇప్పుడు చాలా కమాండెం ట్, ఇతర ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు డిప్యూటేషన్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎస్‌పీఎఫ్‌కు ప్రత్యేకంగా రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోంది.

దాంతో డిప్యూటేషన్ల అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం 1,800 మంది సిబ్బంది ఎస్‌పీఎఫ్‌లో పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ డిప్యూటేషన్‌ వ్యవహారం తెరమీదకు రావడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి స్పష్టమైన కారణం ఏంటన్నది మాత్రం బయటకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

ప్రధానంగా హైకోర్టు జడ్జిల భద్రతకు! 
కొంత మంది ఉన్నతాధికారులను ఈ విష యంపై సంప్రదించగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టుతో పాటు సంబంధిత జడ్జిలకు ప్రత్యేకమైన భద్రత కల్పించాల్సి ఉందని, అందులో భాగంగానే కేంద్ర సాయుధ బలగాలను ఇక్కడ మోహరించేందుకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలను పంపించామని తెలిపా రు. రాష్ట్ర హైకోర్టు, న్యాయ విహార్, కీలకమైన న్యాయమూర్తుల నివాస గృహాల వద్ద కేంద్ర బలగాలను నియమించే అవకాశం ఉందని సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలిసింది. 

ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఎస్‌పీఎఫ్‌ 
రాష్ట్రంలోని ప్రధానమైన దేవాలయాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, బ్యాంకులు, విద్యుత్‌ కేం ద్రాలు.. తదితర కీలక వ్యవస్థల వద్ద గస్తీ కాసే ప్రతీ ఎస్‌పీఎఫ్‌ జవాను మీద ఆయా విభాగా లు ప్రభుత్వ ట్రెజరీకి బిల్లులు చెల్లిస్తుంటాయి. ఎస్‌పీఎఫ్‌ భద్రత కల్పిస్తున్న సంస్థలు ఏటా రూ.50 కోట్ల మేర బిల్లులు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు కేంద్ర బలగాలను ఇక్కడికి తీసుకురావడం వల్ల తమ పదోన్నతులకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది అంటున్నారు. 

శాశ్వతం అవుతుందా? 
ఐటీబీపీ, సహస్ర సీమాబల్, బీఎస్‌ఎఫ్‌లో ఉ న్న తెలంగాణ ప్రాంతానికి చెందిన 500 మంది సిబ్బందిని డిప్యూటేషన్‌పై పంపాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అయితే 1994లో కూడా ఇలాగే కొద్ది కాలం డిప్యుటేషన్‌ మాత్రమే ఉంటుందని భావించినా అలా వచ్చిన వారు తర్వాత శాశ్వత ప్రతిపాదికన ఉండిపోవడంతో ఎస్‌పీఎఫ్‌లో గందరగోళం నెలకొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top