కేన్సర్‌తో పోరాడుతూ.. కరోనా విధులు

Cancer Affected ANM Doing Coronavirus Duty In Adilabad - Sakshi

బోథ్‌: తనకు కేన్సర్‌ వచ్చినా లెక్కచేయకుండా.. కరోనా బాధితులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా బాధ్యతగా విధులు నిర్వహిస్తోంది ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ సామాజిక ఆరోగ్య కేం ద్రంలోని ఏఎన్‌ఎం శారద. ఆమె ఇప్పటి వరకు బోథ్‌ సీహెచ్‌సీలో దాదాపు 3 వేల మందికి కరోనా టీకాలు వేశారు.  కరోనా వేళ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పమే తనను బతికిస్తోందని శారద పే ర్కొంటున్నారు.

2020 జనవరిలో శారదకు లంగ్‌ కేన్సర్‌ ఉన్నట్టు నిర్ధారణ అ యింది. ప్రస్తుతం వ్యాధి నాలుగో దశలో ఉందని వైద్యులు ధ్రువీకరించారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. సెలవు రోజుల్లో మాత్రమే ఆమె ట్రీట్‌మెంట్‌కు వెళ్తున్నారు. కరోనా ఉధృ తి నేపథ్యంలో శారద విధులకు ఏనాడూ సెలవు పెట్టలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ తెలిపారు.  సేవాభావంతో విధులు నిర్వహిస్తున్న శారదను స్థానిక సీఐ నైలు, ఎస్సై రాజు అభినందించారు.
చదవండి: ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లకు కరోనా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top