ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లకు కరోనా 

School Education Department Says Election Duty Teachers Affected Covid - Sakshi

20 మంది వరకు మృత్యువాత  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లలో 450 మంది వరకు టీచర్లకు కరోనా సోకినట్లు పాఠశాల విద్యాశాఖ అంచనాకు వచ్చింది. అందులో 20 మంది వరకు చనిపోయినట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. టీచర్లను కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలనే కేసులో హైకోర్టుకు వివరాలు అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ లెక్కలు సేకరించింది. ఈమేరకు జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు లెక్కలు అందజేశారు.  కోవిడ్‌ సోకిన టీచర్లలో నల్లగొండలో 82 మంది, జనగామలో 45 మంది, ఖమ్మంలో 107 మంది, వరంగల్‌ రూరల్‌లో 141 మంది ఉన్నట్లు తెలిసింది.
చదవండి: Performance‌ Grading‌ Index‌: గ్రేడ్‌–2లో తెలంగాణ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top