
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై(Poker camps) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు ఉన్నారు.
ఆదివారం (ఆగస్ట్17) బాలానగర్ ఎస్ఓటి పోలీసులు కూకట్‌పల్లిలోని ఓ గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న కొండలరావుతో పాటు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ సహా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు. వీరివద్ద నుంచి మూడు లక్షల నగదుతో పాటు, మొబైల్ ఫోన్‌లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.