BRS MLC K Kavitha Reached Delhi To Attend Before ED - Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరుకున్న కవిత.. ఏం జరుగుతుందోనని ఉత్కంఠ

Mar 15 2023 9:40 AM | Updated on Mar 15 2023 5:40 PM

BRS MLC Kavitha Reached Delhi To Attend Before ED - Sakshi

భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

రేపు ఈడీ ముందుకు..
అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు కవిత. ఆమె శనివారమే(మార్చి 11) ఈడీ ఎదుట తొలిసారి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆ రోజు అధికారులు 9 గంటలపాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.

అంజన్న సన్నిధిలో..
కవిత మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే వేకువజామున సుమారు ఐదున్నర గంటల సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆమె గోత్రనామాలపై ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
చదవండి: తెలుగు  రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement