సికింద్రాబాద్‌: లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం | Lashkar Bonalu At Secunderabad Ujjaini Mahankali Temple | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌: లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

Jul 21 2024 7:37 AM | Updated on Jul 21 2024 11:17 AM

Lashkar Bonalu At Secunderabad Ujjaini Mahankali Temple

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా వంద సంవత్సరాల నుంచి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు.

ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగం, అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement