breaking news
secunderabad Ujjaini Mahankali temple
-
సికింద్రాబాద్: లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా వంద సంవత్సరాల నుంచి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు.ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగం, అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలని కోరారు. -
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
-
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
సికింద్రాబాద్: ప్రజలకు ఏ కష్టం రానివ్వను...ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలందరికీ ఎలాంటి భారం, భయం లేకుండా చూసుకునే బాధ్యత తనదని ఆమె భవిష్యవాణి ద్వారా తెలిపారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్వర్ణలత రంగంలో పేర్కొన్నారు. తన ఆజ్ఞ లేకుండా ఏ పనీ చేయవద్దని సూచించారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిచ్చారు.