ప్రజలకు ఏ కష్టం రానివ్వను....


సికింద్రాబాద్: ప్రజలకు ఏ కష్టం రానివ్వను...ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో  రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.  ప్రజలందరికీ ఎలాంటి భారం, భయం లేకుండా చూసుకునే బాధ్యత తనదని ఆమె భవిష్యవాణి ద్వారా తెలిపారు.


 


ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్వర్ణలత రంగంలో పేర్కొన్నారు. తన ఆజ్ఞ లేకుండా ఏ పనీ చేయవద్దని సూచించారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిచ్చారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top