మహబూబ్‌నగర్ జిల్లా: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వినూత్నంగా నిర్వహించిన వరాహాల పోటీలు విశేషంగా అలరించాయి. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ శివారులో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 24 గ్రామాల నుంచి యజమానులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్ గ్రామానికి చెందిన హరికృష్ణ వరాహం.. నారాయణపేట శివకు చెందిన వరాహం ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డాయి. శివ వరాహం గెలుపొందగా నిర్వాహకులు రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. సమీప గ్రామాల నుంచి పెద్దఎత్తున జనాలు తరలివచ్చి పోటీలను ఆసక్తిగా తిలకించారు.


