breaking news
boar
-
షాకింగ్ ప్రమాదం: తృటిలో తప్పిన ప్రాణాపాయం వీడియో వైరల్
స్కూటీపై వెళుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో ఆమె స్కూటర్‌పై వెళుతోంది. ఇంతలో అకస్మాత్తుగా అడవి పందుల గుంపు ఒకటి రోడ్డు మీదకి వచ్చింది. ఈ పరిణామాన్ని ఊహించని ఆమె వాటిని ఢీకొట్టింది. అంతే.. స్కూటర్ అదుపు తప్పి ఆమెఎగిరి పల్టీలు కొట్టింది. . స్థానికులు ఆమెను గుర్తించి, ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తిరువనంతపురంలోని పలోడ్ పెరింగల రోడ్డుపై ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలు పెరింగమ్మలకు చెందిన నిసాగా గుర్తించారు. ఇంటికి తిరిగి వెళుతుండగా ఆగస్టు 8 వ తేదీ మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఆమెను చికిత్స కోసం మెడికల్ కాలేజీకి తరలించారు. రాత్రిపూట అడవి పందుల దాడులు సర్వసాధారణం అయినప్పటికీ, పగటిపూట ఇటువంటి సంఘటనలు చాలా అరుదు అని స్థానికులు వ్యాఖ్యానించారుतिरुवनंतपुरम में जंगली सूअरों से टकराकर एक महिला का गंभीर एक्सीडेंट हुआ. महिला स्कूटी से जा रही थी, तभी सड़क पार कर रहे सूअर अचानक आ गए और महिला गिर पड़ी. स्थानीय लोगों ने उसे अस्पताल पहुंचाया, जहां उसकी हालत गंभीर बनी हुई है.#kerala #tiruvananthapuram #accident #pigs #viral… pic.twitter.com/ukS6OrM4ec— ABP News (@ABPNews) August 10, 2025 -
బిక్నూరులో అడవి పందుల భీభత్సం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో అడవి పందులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని బిక్నూరు మండలం ఆరెపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి చెరకు పంటపై దాడిచేసి ధ్వంసం చేశాయి. గ్రామానికి సమీపంలో 9 ఎకరాల చెరకు పంటపై దాడికి దిగిన అడవి పందులు సుమారు రూ.3.50 లక్షల పంటను నాశనం చేశాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా చెరకు సాగు చేస్తే సుమారు 50 టన్నుల దిగుబడి వస్తుందని, అలాంటిది 9 ఎకరాల మేరా పంట నాశనం అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమ మొర ఆలకించాలని కోరుతున్నారు.