షాకింగ్‌ ప్రమాదం: తృటిలో తప్పిన ప్రాణాపాయం వీడియో వైరల్‌ | Caught on CCTV: Woman injured after wild boar collides with her scooter | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ప్రమాదం: తృటిలో తప్పిన ప్రాణాపాయం వీడియో వైరల్‌

Aug 11 2025 1:11 PM | Updated on Aug 11 2025 3:03 PM

Caught on CCTV: Woman injured after wild boar collides with her scooter

స్కూటీపై వెళుతున్న మహిళ తృటిలో  ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.  నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో ఆమె స్కూటర్‌పై వెళుతోంది. ఇంతలో  అకస్మాత్తుగా అడవి పందుల  గుంపు ఒకటి రోడ్డు మీదకి వచ్చింది. ఈ పరిణామాన్ని ఊహించని ఆమె వాటిని ఢీకొట్టింది. అంతే.. స్కూటర్‌ అదుపు తప్పి  ఆమెఎగిరి పల్టీలు కొట్టింది. . స్థానికులు ఆమెను  గుర్తించి, ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.  


తిరువనంతపురంలోని పలోడ్ పెరింగల రోడ్డుపై ఈ సంఘటన చోటు చేసుకుంది.  దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.  బాధితురాలు పెరింగమ్మలకు చెందిన నిసాగా గుర్తించారు.  ఇంటికి తిరిగి వెళుతుండగా ఆగస్టు 8 వ తేదీ మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఆమెను చికిత్స కోసం మెడికల్ కాలేజీకి తరలించారు. రాత్రిపూట అడవి పందుల దాడులు సర్వసాధారణం అయినప్పటికీ, పగటిపూట ఇటువంటి సంఘటనలు చాలా అరుదు అని స్థానికులు వ్యాఖ్యానించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement