Telangana: రూ.150 బీరు.. రూ.180కి విక్రయం..! | Beer Prices Hike In Telangana, Know New Price Details Inside | Sakshi
Sakshi News home page

Telangana Beer Prices Hike: రూ.150 బీరు.. రూ.180కి విక్రయం..!

Feb 12 2025 8:32 AM | Updated on Feb 12 2025 11:14 AM

Beer Price Hike In Telangana

    ధరల పెరుగుదలకు ముందే దోపిడీ

భైంసాటౌన్‌: బీర్ల ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ ఎంతమేర పెంచాలన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినా పట్టణంలో కొందరు వైన్స్‌ నిర్వాహకులు బీర్ల ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మంగళవారం పట్టణంలోని బాసర రోడ్డులో గల ఓ వైన్స్‌షాపులో రూ.150 ఎమ్మార్పీ ఉన్న బీరును రూ.180కి విక్రయించినట్లు ఓ మద్యం ప్రియుడు వాపోయాడు. ఈ మేరకు తన ఫోన్‌పే నంబర్‌ ద్వారా డబ్బులు చెల్లించినట్లు రశీదు చూపాడు. 

ధరల పెరుగుదలకు ముందే పెంచి విక్రయించడం ఎంతవరకు సబబని అతడు ప్రశ్నిస్తున్నాడు. బీర్ల ధరల పెంపు విషయమై ఎక్సైజ్‌ సీఐ నజీర్‌హుస్సేన్‌ను ఈ సందర్భంగా వివరణ కోరగా తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. పాత స్టాకును పాత రేట్లకే విక్రయించాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు లేకుండానే అధిక ధరలకు విక్రయించడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement