
బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్ బస్తీలో ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలకు వివిధ వృత్తులను, కళల్లో ఉచితంగా శిక్షణనిచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించినట్లు సంస్థ ఫౌండర్ శైలా తాళ్ళూరి తెలిపారు.

ఈ వేడుకల్లో ఇనిస్టిట్యూట్‌లో వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన యువతులతో పాటు మహిళలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ వేడుకలతో పాటు నిర్వహించిన కోలాటం వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరనంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐర్లాండ్‌కు చెందిన సైంటిస్ట్ రుక్మిణి, ప్యూర్ సంస్థ సలహాదారు పార్వతి పాల్గొన్నారు.
