లోక్‌సభ ఎన్నికల బరిలో ‘బర్రెలక్క’.. నామినేషన్‌ దాఖలు | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల బరిలో ‘బర్రెలక్క’.. నామినేషన్‌ దాఖలు

Published Tue, Apr 23 2024 3:50 PM

Barrelakka Filed Nomination From Nagarkurnool Lok Sabha Independent Candidate  - Sakshi

సాక్షి,కొల్లాపూర్‌ : గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. 

నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఏప్రిల్‌ 23న (ఇవాళ) నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క నామినేషన్‌ వేసేందుకు తరలి వచ్చారు. 

డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని
డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పెట్టిన వీడియోతో శిరీష్‌ ఫేమస్‌ అయ్యారు. దీంతో ఆమె బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో నిరుద్యోగ సమస్యపై తనగొంతు వినిపించారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీ మద్దతు వచ్చింది. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు. 

నైతికంగా విజయం సాధించా
ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓటమి పాలయినప్పటికీ  నైతికంగా గెలిచారు. 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. ఎన్నికల ఫలితా అనంతరం.. ఓటర్లు ఒక్క రూపాయి డబ్బు పంచకుండా నిజాయతీగా నాకు ఓట్లేశారు. నేను గెలిచానని భావిస్తున్నా. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటా. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేస్తా అని బర్రెలక్క చెప్పారు. నాడు చెప్పినట్లుగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా బర్రెలక్క మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

నాగర్‌ కర్నూల్‌లో లోక్‌సభ అభ్యర్ధులు  
నాగర్​కర్నూల్ లోక్​సభ నుంచి పోటీకి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ ​నుంచి సీనియర్​ నేత, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్​ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్​ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు పోతుగంటి భరత్​ప్రసాద్​కు టికెట్​ ఇప్పించుకోగలిగారు. బీఎస్పీ స్టేట్ చీఫ్​హోదాలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్​ఆర్.ఎస్.​ ప్రవీణ్​కుమార్​బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement